ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం
ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కలిసాం… …చదువులమ్మ చెట్టు నీడలో… అంటూ విద్యార్థిని విద్యార్థులు ఆట పాటలతో అధ్యాపకులను అలరించారు
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సమావేశం శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి సిహెచ్ మోహన్ డి ఐ ఈ ఓ హాజరయ్యారు ఇంటర్ విద్యాధికారి సిహెచ్ మోహన్ మాట్లాడారు కొద్ది రోజుల్లో నే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్ వివేకానంద్ కే సత్యన్నారాయణ, ఎం చంద్రమౌళి, కే మహేష్, ఎస్ శ్రీనివాస్, పి ఆంజనేయులు, డి శ్రీనివాస్, నాగమణి ,గీత, అధ్యాపక బృందం పాల్గొన్నారు
