బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా ఈ మీటింగ్స్ జరుగుతాయని వారు చెప్పడం జరిగింది
మహిళలకు వడ్డీ లేని రుణాల పేరిట, యువతను నిరుద్యోగ భృతి పేరిట మోసం చేసిందని, అధిక కరెంట్ చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందని,అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని అన్నారు. శక్తి కేంద్రాలు, బూత్ ల వారిగా ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేయాలని వారు అన్నారు, బీజేపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెడిశేట్టి బాలయ్య కిరణ్ నాయక్ గుర్రాల రాజు గడ్డం రవి పూర్ణచందర్ శ్రీకాంత్ గెంటి రవి రమేష్ సన్నీ ధనాల దేవయ్య కిషన్ సురేష్ గోపి సురేష్ శ్రవణ్ శేఖర్ బూత్ నాయకులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
