ప్రాంతీయం విద్య

ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన బంగారు పుత్రిక

344 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బంగారు ఆభరణాలు తయారు చేసే దంపతుల పుత్రిక 10 కి 9.8 జి పి ఏ సాధించి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల  కలలను నెరవేర్చిన విద్యార్థిని. రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు శ్రీపాద లింగమూర్తి కూతురు మధుర మీనాక్షి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంది. నిన్నటి రోజు పదవ తరగతి ఫలితాల్లో 9.8 జిపిఏ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మీనాక్షి ఖరీదైన విద్యను అభ్యసించే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇటు తల్లిదండ్రుల కలలను అటు ఉపాధ్యాయుల పేరును నిలబెట్టింది. విద్యార్థిని మీనాక్షిని స్థానిక గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు  ఉపాధ్యాయులు అభినందించారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్