TS: డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో ఛాన్స్ కల్పించింది. దోస్త్ చివరి దశ (స్పెషల్ రౌండ్) కౌన్సెలింగ్ గడువు అక్టోబర్ 7తో ముగియగా, దాన్ని అక్టోబర్ 11 వరకు పొడిగించింది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 11వ తేదీ వరకు ఉంటుందని, 13న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపింది. అక్టోబర్ 15లోగా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని వివరించింది.
