తెలంగాణ వ్యాప్తంగా ప్రజా గోస బీజేపీ – బరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్ట్రీట్ కార్నర్ సమావేశం లో బాగంగా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో భరత్ నగర్ శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ ఇందిరాపార్క్ చౌరస్తాలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్, బిజెపి కార్నర్ మీటింగ్ల కోఆర్డినేటర్ దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా బాలకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరవీరుల త్యాగం పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విధానాన్ని మరిచి రాష్ట్రంలోని నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు కెసిఆర్ కుటుంబం లబ్బర్ చెప్పుల నుండి లక్షల కోట్లకు పెరిగింది అలాగే గజ్వెల్ పట్టణంలో కూడా అన్ని పెండింగ్ పనిలే అన్నారు ఇంతవరకు గజ్వేల్ ప్రజలకు బస్టాండు లేకపోవడం కెసిఆర్ అభివృద్ధికి అద్దం పడుతుందన్నారు మున్సిపాలిటీ పాలకవర్గానికి అవినీతి పంపకాల మీద ఉన్న దృష్టి అభివృద్ధి మీద లేదన్నారు అందుకే విశ్వాసం కోల్పోయే అవిశ్వాసం పెట్టారు కౌన్సిలర్ అన్నారు.