గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్24/7
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మ్యాడ వంశీధర్ కు పీ హెచ్ డి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అవార్డు దక్కింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాడ లింగయ్య లక్ష్మిల చిన్న కుమారుడు వంశీధర్ కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీ వాణిజ్య విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో వ్యవసాయంలో కలిగే నష్టాలు, నష్ట నివారణ వ్యూహాలపై రైతుల అవగాహన ఏ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి గ్రంథాలు సమర్పించినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ పీ హెచ్ డి పట్టాను అందించింది. వంశీధర్ పి హెచ్ డి పట్టాను సాధించడం పట్ల కొత్తపల్లి గ్రామానికి చెందిన సాక్షి సీనియర్ జర్నలిస్టులు లచ్చులగారి పరశురాములు గౌడ్,, గౌటే దేవేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు పెద్దూరి పరుశరాములు గౌడ్, శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌటే గణేష్, బీసీ సేన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బట్టు ప్రవీణ్, కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేడ భాస్కర్, మహమ్మద్ ఎదుల్,దమ్మ శ్రీనివాస్, వంగ మహేందర్ రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు..
