ప్రాంతీయం

పోయిన మొబైల్ ని ఒక్కరోజులో అప్పగించిన ఎస్ఐ

111 Views

*టెక్నాలజీ ఉపయోగించి 20 వేల రూపాయలు కరిదైనా VIVO C3, 5G గల మొబైల్ ని వన్ డే లో అప్పగించిన నస్పూర్ S I సుగుణాకర్*

నస్పూర్ టౌన్ మునిసిపల్ పరిధి 15 వ వార్డ్ శ్యాంనగర్ చెందిన గుగులోత్ నరేష్ అనే ఆటో కార్మికుడుని గుర్తు తెలియని వ్యక్తి సీసీసీ కార్నర్ నుండి కరీంనగర్ అపోలో హాస్పిటల్ కి కిరాయి అని తీసుకెల్లి ఆటో కార్మికుని సెల్ ఫోన్ తీసుకుని కాల్ చేసి ఇస్తా అని చెప్పి అతను అక్కడి నుండి VIVO, C3, 5G గల 20 వేల రూపాయలు కరిదైనా మొబైల్ తో పారిపోవడం జరిగింది.

ఈ విషయం శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ కి చెప్పడం తో వారు వెంటనే స్పందించి నస్పూర్ S I నెల్కి సుగుణాకర్  కి ఫిర్యాదు చేయడం తో వారు వెంటనే స్పందించి టెక్నాలజీని ఉపయోగించి వన్ డే లో సెల్ ఫోన్ బాధితునికి అప్పగించడం  జరిగింది. ఇందుకు గాను ఆటో కార్మికుని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ నస్పూర్ S I నెల్కి సుగుణాకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్