నడకతో ఆరోగ్యం చెత్త ఏరి వేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేసుకోవచ్చని మరో సంస్కరణకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గజ్వెల్ ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో గల వెంకటేశ్వర ఆలయం వద్ద నడుస్తూ చెత్త ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి,గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి,వైస్ చైర్మన్ జక్కి ఉద్దీన్ పాల్గొని మురికి కాల్వ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు,చాయ్ గ్లాస్ లను స్వయంగా ఎత్తి చెత్త సంచిలో వేసారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ విద్యాధర్, జెడ్పిటిసి పంగా మల్లేశం, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, కౌన్సిలర్లు,కోఆప్షన్స్ సభ్యులు, డైరెక్టర్లు , నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
