చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండల కేంద్రంలో స్వరాష్ట్ర సాధకులు, తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ, జన్మదిన వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ను సాధించడానికి పుట్టిన యుగపురుషుడని, కారణజన్ముడని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశంలో గొప్ప పేరు గడించాడని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య రమేశ్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్ రావు, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచులు ఐల్నేని కమలాకర్ రావు, గట్టు లక్ష్మీ నారాయణ, చిలుక అంజిబాబు, దుమ్మ ఆనందం, న్యాత జార్జ్, అట్టెపల్లి భూమయ్య, ఎనుగుల జమున శ్రీనివాస్, ఎంపిటీసీలు మాదాసు కవిత ప్రసాద్, బత్తుల కమలాకర్, మరాఠీ మల్లిక్, ఈర్లపల్లి రాజు, సంటి బాబురావు, పడిగెల శ్రీనివాస్, కొమ్ము రమేశ్, కొండ లక్ష్మణ్, మల్యాల గంగనర్సయ్య, లింగాల మల్లయ్య, సిరికొండ మల్లయ్య, చిగుర్ల రాకేశ్, భూమండ్ల మధు, అడ్డగట్ల నందం, ఆకుల ఎల్లయ్య, వరికెల అబ్బాస్, సంజీవ్, లక్ష్మణ్, నగేష్, సురేష్, మోహన్, శంకర్* తదితరులు పాల్గొన్నారు.