చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ వారు రూమ్ టు రెడ్ మండల కోఆర్డినేటర్లు అజిత్ రాజ్, సక్కుబాయి గార్లు 200 కథల కార్డులను, పుస్తకాలను మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితుల చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణకు గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితుల మాట్లాడుతూ… రీడ్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా చదువు ఆనందించు అభివృద్ధి చెందు అనే అంశాన్ని ప్రాతిపదికగా ప్రతి విద్యార్థి దారాళంగా చదవడం వ్యక్తిగతంగా మరియు ఇంటి వద్ద చదవడం అలవాటుగా చేసుకొని పుస్తక పఠనం జీవితంలో ఒకటిగా అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.