(మానకొండూర్ డిసెంబర్ 16)
మానకొండూర్ మండలంలోని వాటర్ ట్యాంకు సమీపంలో కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై టూ వీలర్ పై కరీంనగర్ వైపు వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గంగిపల్లి గ్రామానికి చెందిన ములుకల సుధాకర్ (55) అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు కాగా,108 వాహనంలో పోలీస్ లు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని మానకొండూర్ సీఐ రాజకుమార్ తెలిపారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..