చందుర్తి – జ్యోతి న్యూస్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఊరడి రాములు (62) ఆశిరెడ్డి పల్లి గ్రామం నుండి చందుర్తికి తన బావ రాజమల్లుతో కలిసి బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన రొండ్ల రవీందర్ రెడ్డి టాటా ఏసీ వాహనంలో అతి వేగంగా వచ్చి రామన్నపేట చెరువు కట్ట మీద ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.స్థానిక ఎస్సై ఎల్. శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకొని మృతుని భార్య లక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.