జగదేవ పూర్: అక్టోబర్ 14
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామం లో బతుకమ్మ పండగ సందర్బంగా చెరువు వద్ద పారిశుధ్య పనుల నిమిత్తం వెళ్లిన సమయం లో దురదృష్టవశాత్తు కాలు జారీ చెరువులో పడి ముగ్గురు గ్రామ పంచాయితీ సిబ్బంది మృతి చెందారు విషయం తెలుసుకున్నా రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామ్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జరిగిన సంఘటన పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు..వారి మృతి చాలా బాధాకరమని, అన్నారు. మృతి పట్ల సంతాపం ప్రకటించారు.. వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని చెప్పారు.
