గత వారం రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన వీర్నపల్లి మండల వైస్ ఎంపీపీ భర్త ఈసంపల్లి దేవేందర్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామానికి చెందిన జనశక్తి మాజీ నేత భారత రాష్ట్ర సమితి నాయకులు ఈసంపల్లి దేవేందర్ అకస్మిక మృతి పట్ల రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం వైస్ ఎంపీపీ ఈసంపల్లి హేమ స్వగృహంలో దేవేందర్ చిత్రపటానికి మంత్రివర్యులు కేటీఆర్ ఘన నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఇదే గ్రామానికి చెందిన గర్జనపల్లి మాజీ సర్పంచ్ గొల్లపల్లి కిషన్ రహదారి ప్రమాదంలో దుర్మరణం చెందారు. గొల్లపల్లి కిషన్ కుటుంబాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెంట రాజన్న సిరిసిల్ల భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , మండల ప్రజా ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
