కుక్కల దాడిలో 12 జీవాల మృతి 60 వేల రూపాయల నష్టం ఎల్లారెడ్డి పేట: 25 జనవరి , 2023 కుక్కల దాడిలో 12 జీవాలు మృతి చెందిన సంఘటన అల్మాస్ పూర్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వేళితే వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల కు చెందిన కేశవేణి ఎల్లయ్య యాదవ్, ప్యాట్ల ఎల్లయ యాదవ్ , దయ్యాల మల్లయ్య యాదవ్ లు జీవాలను పెంచుకుంటూ జీవిస్తున్నారు. ఉపాధి లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ లో ఉన్న జీవాల మంద పై కుక్కలు దాడి చేయడం తో 12 జీవాలు మరణించినట్లు బాధితులు తెలిపారు.ముగ్గరికి చెందిన 12 జీవాల మరణం తో తమకు 60 వేల రూపాయల నష్టం జరిగిందని బాధితులు రోదిస్తూ పెర్కోన్నారు. జీవాలకు మద్దిమల్ల లో మేత లేకపోవడం తో అల్మాస్ పూర్ కు మణ్యం ద్వారా వలస వచ్చామన్నారు. కేశవేణి నర్సయ్య యాదవ్ పోలం లో జీవాల మంద ఏర్పాటు చేశామన్నారు.మంగళవారం సాయంత్రం ప్రాంతంలో జీవాలకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన కంచె ను సైతం తెంపేసి జీవాల పై కుక్కలు దాడి చేయడం వల్ల ముగ్గురి కి చెందిన 12 జీవాలు మృతి చెందినట్లు వారు వాపోయారు. అప్పు చేసి జీవాలను కోనుగోలు చేశామన్నారు. జీవాల మరణం తో తమకు ఆర్థిక నష్టం జరిగిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. తమను స్థానిక మంత్రి వర్యులు కెటిఆర్ ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
ప్రకటనలు ప్రాంతీయం

బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

133 Views

గత నాలుగు రోజుల క్రితం కుక్కల దాడిలో 12 జీవాలు మృతి చెందిన సంఘటన అల్మాస్ పూర్ లో చోటు చేసుకోగా బాధిత రైతులకు గొల్ల కురుమ యాదవ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. వీర్నపల్లి మండలం లోని మద్దిమల్ల కు చెందిన కేశవేణి ఎల్లయ్య యాదవ్, ప్యాట్ల ఎల్లయ యాదవ్ , దయ్యాల మల్లయ్య యాదవ్ లు జీవాలను పెంచుకుంటూ జీవిస్తున్నారు. ఉపాధి లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ లో ఉన్న జీవాల మంద పై కుక్కలు దాడి చేయడం తో 12 జీవాలు మరణించాయి. 12 జీవాల మరణం తో 60 వేల రూపాయల నష్టం వాటిల్లింది. జీవాలకు మద్దిమల్ల లో మేత లేకపోవడం తో అల్మాస్ పూర్ కు మణ్యం ద్వారా వలస వచ్చారు. కేశవేణి నర్సయ్య యాదవ్ పోలం లో జీవాల మంద ఏర్పాట చేశారు. గొర్రెల మేకల మందపై కుక్కలు దాడి చేసిన విషయం తెలుసుకున్న యాదవ గొల్ల కురుమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మిర్యాల భాస్కర్ యాదవ్, ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండలాల యాదవ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మెండె శ్రీనివాస్ యాదవ్ విరాళాల ద్వారా 21,050 వేల రూపాయలను బాధితులకు నగదు అందజేశారు.మంత్రి కేటీఆర్ ద్వారా గొర్రెల యూనిట్లను ముగ్గురు బాధిత రైతులకు అందించేందుకు కృషి చేస్తామని యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *