ప్రాంతీయం

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు

144 Views

సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డ్ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ కు వారి స్వగృహంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు వెంకటేష్ మాట్లాడుతూ అత్తెల్లి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగింది అని అత్తెల్లి శ్రీనివాస్ రాజకీయంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తు ప్రజల మన్నన పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని, భవిషత్తు లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటూ మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కోఆప్షన్ గంగిశెట్టి రాజు, కొలుగూర్ ఎంపీటీసీ స్వామి ,మల్లేష్, బాలరాజు మరియు ఇతర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *