ప్రాంతీయం

కేంద్ర ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మను దగ్ధంచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

125 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూలై 7, మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దాహణం చేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్ట్ విచారణకు స్వీకరించకుండా తిరస్కరించబడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రాజకీయ కక్ష సాధింపు ధోరణినిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు మోడీ పేరు ఉన్నవాళ్లు ఈదేశాన్ని దోసుకా తింటున్నారని మాట్లాడిన ప్రచారంలో భాగంగా వెనువెంటనే 6 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా కోర్టు ప్రకటించడం ఈదేశంలో రాహుల్ గాంధీకి భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలనుండి లభించిన ఆదరణ చూసి ఓర్వేలేక పార్లమెంటులో కార్పొరేట్ వ్యవస్థ అయినా అంబానీ ఆదానిలకు రైల్వేలు విమానాశ్రయాలు పోర్టులు ఎల్ఐసి సంస్థలు కార్పొరేట్ వ్యవసాయాలు అనేక రకాలుగా ఈ ప్రభుత్వము వారికి లబ్ధిచేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిలదీసినందుకు పార్లమెంటులో ప్రశ్నించే నాయకుడు ఉండద్దని ఉద్దేశంతో రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడం సిగ్గుచేటు గుజరాత్ హైకోర్టు స్టే పిటిషన్లు తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందిని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, సీనియర్ నాయకులు వేలమల రామిరెడ్డి, అట్ల మహేష్ రెడ్డి ,ముస్తాబాద్ యువ కాంగ్రెస్ అధ్యక్షుడు రంజాన్ నరేష్ సోషల్ మీడియా మండలాధ్యక్షుడు ఎదునూరి భాను ,సత్యం గౌడ్, మెరుగు శివ,దుర్గా ప్రసాద్, భాను ప్రసాద్. ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *