దుంపెన రమేశ్ పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం స్వీకరణ
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన *”యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సేవాసంస్థ”* వారు స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి జాతీయ ఉత్సవాలను పురస్కరించుకుని జనవరి 29న హుస్నాబాద్లో ఉదయం 10గం లకు పురస్కారం ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన కవి రచయిత దుంపెన రమేశ్ గారిని *యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ* వారు *”పర్యావరణ పరిరక్షణ హరితమిత్ర స్ఫూర్తి పురస్కారం”* స్వీకరణ”
కవి రచయిత దుంపెన రమేశ్ గారు గత పదిహేను సంవత్సరాలుగా మొక్కల పంపిణీ, సంరక్షణ ,పర్యావరణ పరిరక్షణకోసం కృషి చేస్తున్నారు. సాహితీ రంగములో చిగురు, గుమ్మడి పూలు, తులసి పుస్తకాలు రాశారు.వేల ఆహ్వాన పత్రికలు,వందల రేడియో,టేపులు సేకరించారు. సామాజిక స్వచ్ఛంద సేవలు చేస్తున్న సాహితీ సేవల్ని గుర్తించి జనవరి 29న “పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారంతో” సత్కరించారనీ దుంపెన రమేశ్ గారు తెల్పారు.
ఈ పురస్కారం లభించడంపట్ల *టి.ఆర్.ఎస్.జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య,యెల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతి సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, డా. జి.సత్యనారాయణస్వామి, డా. వాసరవేణి పరశురాం, డా. జనపాల శంకరయ్య,యమగొండ బాల్ రెడ్డి, చందనం భాస్కర్, ఎ.రవి, కట్ల శ్రీనివాస్, గంప నాగేంద్రం, వాసరవేణి దేవరాజు,వెంగల లక్ష్మణ్, ,ఆడెపు లక్ష్మణ్* తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
