స్టేన్ బోరర్ (మొగి) పురుగు వలన దెబ్బ తిన్న వరి పొలాలను వ్యవసాయ అధికారులచే సర్వే చేయించి పంట నష్ట వివరాలను ప్రాథమికంగా అంచన వేసి ప్రభుత్వానికి నివేదిక అందచేస్తానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్ నారాయణరావుపేట మండల కేంద్రం మరియు బెజ్జంకి మండల కేంద్రంలోని వరి పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా నోబి పురుగు సోకడం వలన వరి పైరు ఎదగకుండా ఎర్రబారి పోతుందని వ్యవసాయ అధికారులు కలెక్టర్కు వివరించారు. అదేవిధంగా పంట నష్టపోతున్నందున ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నారాయణరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మరియు బెజ్జంకి గ్రామంలో రైతులనుద్దేశించి మాట్లాడుతూ వరి పైరుకు తెగులు సోకి రైతులు ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య,ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు క్షేత్రస్థాయిలో వరి పంటను పరిశీలించి వ్యవసాయశాఖ ద్వారా రైతులకు ఏ విధంగా సహాయం చేయగలమో, పంటను ఏ విధంగా రక్షించుకోగలమో పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో కలిసి పంట పొలాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. వ్యవసాయ అధికారులతో పంట నష్ట వివరాలను సేకరించి మంత్రివర్యులు హరీష్ రావుకు నివేదిక సమర్పించడం జరుగుతుందని అన్నారు. ప్రకృతి మరియు ఇతర కారణాల వలన పంటలకు తెగులు సోకుతాయి. రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికార యంత్రాంగం మీకు అండగా ఉంటుంది. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రసాయనిక, సేంద్రియ ఎరువులను వాడాలి. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పంటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు అవసరమైన మందులను రైతులకు సూచించాలని, పంటలకు తెగలు సోకకుండా పంట వేసేటప్పుడు ముందస్తుగా వ్యవసాయదారులు తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని రైతువెదికల్లో పంటలు వేసె విధానం క్రమపద్ధతిలో వెసె మందుల వివరాలను కూడిన ప్లేక్సిలు పెట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. అదేవిధంగా ఒక పంటకు మరో పంటకు మధ్య తగినంత సమయం ఇచ్చి భూమి తడి ఆరిన తర్వాత దుక్కి దున్ని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్యాంప్రసాద్, వ్యవసాయ శాస్త్రవేత్త విజయ్ కుమార్, ఆయా మండలాల తాసిల్దార్లు తదితరులు ఉన్నారు.