ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు,విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు .జ్ఞాన దీప్ పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హాజరై విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు .అనంతరం గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు .మొదటి బహుమతి మారేపు రవళి గొల్లపల్లి ,రెండవ బహుమతి అందె స్వప్న గొల్లపల్లి ,మూడవ బహుమతి అల్లాడి గీతారాణి బొప్పాపూర్ ,నేలవల్లి స్రవంతి రాజన్నపేట లు గెలుపొందారు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ ,ప్రిన్సిపాల్ రిన్సీ జార్జ్ , ఏవో పద్మావతి ,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
