మేకల కనకయ్య ముదిరాజ్ కు ఆత్మీయ సత్కారం.
సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, చేబర్తి గ్రామ ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో మర్కుక్ మండల కేంద్రంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య, ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా చే బర్తి గ్రామం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తోట సాయిలు ముదిరాజ్, మాట్లాడుతూ మేకల కనకయ్య ముదిరాజ్ నిరుపేదలకు అండగా ఉంటూ ముదిరాజ్ సంఘం బలోపేతానికి విశేషంగా కృషి చేస్తూ నిత్యం ప్రజల బాగోగుల కోసం పని చేస్తూ ఆపద ఉన్నది అంటే నేనున్నానని భరోసా కల్పిస్తూ నిరుపేదల ఆడబిడ్డ పెళ్లికి ఒక మేనమామ లాగా పుస్తే మట్టలు అందజేస్తూ,నూతన దేవాలయాలకు తన వంతు విరాళాలు అందజేస్తూ, కరోనా క్లిష్ట సమయంలో ఎంతోమందిని ఆదుకున్న మేకల కనకయ్య ముదిరాజ్ సేవలను గుర్తించి సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో కళారత్న అవార్డు అందజేయడం జరిగింది అని ఇలాంటి అవార్డులు మరెన్నో పొందాలని చేబర్తి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మేకల కనకయ్య ముదిరాజ్ కు చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు ఈకార్యక్రమంలో చేబర్తి గ్రామ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి, దేశ బోయిన నర్సింలు, పోయిల మల్లేశం తదితరులు.