రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వసంత పంచమి రోజున సరస్వతి దేవి విగ్రహాన్ని కళాశాలలో ప్రతిష్టించారు.. ముచ్చర్ల గ్రామానికి చెందిన గాడిచర్ల శ్రీనివాస్- మహేశ్వరి దంపతులు డిగ్రీ కళాశాలకు సరస్వతి దేవి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిట్ల దాసు మాట్లాడుతూ.. కళాశాలకు సరస్వతి దేవి విగ్రహాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎప్పుడు కొనసాగించాలని కోరుతూ,విగ్రహ దాతకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మరియు ఐక్యూఎసి కోఆర్డినేటర్ బీ.శ్రీవల్లి,సీనియర్ అధ్యాపకులు పి. కృష్ణమూర్తి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థి ని , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
