ప్రాంతీయం

పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రెస్ మీట్

111 Views

వివేక్ వెంకటస్వామి తన నివాసంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మరియు రేగుంట సునీల్ మాదిగ.

పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కామెంట్స్.

పెద్దపల్లి నియోజకవర్గంలో కాక కుటుంబానికి 60 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

కాకా వెంకటస్వామి సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు 450 కోట్ల లోన్ ఇప్పించి శాఖలో ఉన్న లక్ష ఉద్యోగులను కాపాడారు.

జైపూర్ లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ పునరుద్ధరణకు కాకా కృషి చేశారు. పెన్షన్లు పిడిఎస్ సిస్టం కాకా కృషి ఫలితమే.

కార్మికుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి, వినోద్ గారు అండగా ఉన్నారు.

బ్రిటిషర్ల విభజించు పాలించ సిద్ధాంతాన్ని బిజెపి బిఆర్ఎస్ తెలంగాణలో ఫాలో అవుతున్నాయి.

దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి కుట్ర చేస్తున్నాయి.

కాకా కుటుంబం కులమతాలకు అతీతం.. పేదలకు సేవ చేయడమే మా లక్ష్యం.

టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుంది.. దళితులను మోసం చేసింది.

ఇండస్ట్రియల్ లిస్టు గా నా జీతం డబ్బులతో కంపెనీని స్థాపించి 500 మందికి ఉద్యోగాలు కల్పించాను. అందులో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన యువకులే ఎక్కువమంది ఉన్నారు.

బిజెపి టిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిని అంగీకరించారు అందుకే నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

కాకా కుటుంబానికి పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉన్నాము విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.

నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.

 

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్