73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే రాయపోల్ మండల నవ తెలంగాణ రిపోర్టర్ పుట్టరాజుకు డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం 2022 వచ్చిన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ మేనేజర్ రేవంత్ కుమార్ నవ తెలంగాణ సిద్దిపేట జిల్లా విలేకరుల సమావేశంలో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తూ సామాజిక కోణంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తు ఎన్నో సమస్యలు ఎవరికి తీయడమే కాకుండా పరిష్కార మార్గాన్ని చూపించే విధంగా వార్తలు రాయడమే జర్నలిస్టు లక్షణం. జర్నలిస్ట్ పుట్ట రాజుకి డా.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి 2022 పురస్కారం రావడం హర్షణీయం అన్నారు. వీరు మరింత బాధ్యతగా పనిచేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెస్క్ ఇంచార్జ్ జంగయ్య, జిల్లా స్టాపర్ కృష్ణ, సిద్దిపేట పిసి ఇంచార్జ్ శ్రీనివాస్, గజ్వేల్ పిసి ఇంచార్జ్ యాదగిరి, సిద్దిపేట ఏడివిటీ ఇంచార్జ్ యాదగిరి, గజ్వేల్ ఎడివీటి ఇంచార్జ్ నరసింహారెడ్డి, సర్కులేషన్ ఇంచార్జ్ నారాయణ, వివిధ మండలాల నవతెలంగాణ విలేకరులు పాల్గొన్నారు.
