రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన సల్వాల రజిత గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ వారితో బాధపడుతూ వారం రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి తెలంగాణ రజక సంఘాల కన్వీనర్ లో కుర్తి బాల మల్లయ్య మరియు గ్రామ అధ్యక్షులు కంచర్ల నర్సింలు తమ వంతు సహాయంగా 5000 రూపాయలు సహాయం చేస్తూ, ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని ఆదుకుంటూ వారి ఒక గాను ఒక కుమారుడికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలోఇతర గ్రామాల కులస్తులు,దుమాల గ్రామ కులస్తులు,దుమల గ్రామ సర్పంచ్ భర్త శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
