ప్రకటనలు

బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన భజరంగ్ దళ్ 70మంది కార్యకర్తలు

248 Views

భజరంగ్ దళ్ వేములవాడ పట్టణ అధ్యక్షుడు మంత సందీప్, ఉపాధ్యక్షుడు సాయినేని రాకేష్ లతో పాటు 70మంది కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీనరసింహారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు వేములవాడను అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహా రావు ఆలోచన విధానం, చల్మెడ నాయకత్వంలోనే వేములవాడ అభివృద్ధి చెందుతుందనే పూర్తి విశ్వాసంతో పార్టీలో చేరుతున్నామని, రాబోయే రోజుల్లో చల్మెడ గెలుపు కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆర్.సి రావు, కౌన్సిలర్ గోలి మహేష్, నాయకులు గూడూరి మధు, గడ్డమీది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *