ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవము సందర్భంగా అవగాహన ర్యాలీసదస్సు:- డా.స్రవంతి మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి
గురువారం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ఎల్లారెడ్డి పేట పరిధిలో ఎయిడ్స్ డే దినోత్సవమును పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు దీనిలో భాగంగా ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహనను కల్పించారు ఎయిడ్స్ వ్యాధికి సంబంధంచిన వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధిని కలిగించే వైరస్ పై దాని వ్యాపించే పద్ధతుల గురించి, ఎయిడ్స్ లక్షణాలు పరీక్షలు, మందుల గురించి తెలియజేశారు. అనుమానం గల వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆరోగ్య కార్యకర్తలను గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కి వచ్చి తగిన సలహాలు సూచనలు తీసుకోవచ్చును పరీక్షలను కూడా చేసుకోవచ్చును. ఎయిడ్స్ వ్యాధిని ముందుగానే గుర్తించి పరీక్ష చేసుకోని మందులు వాడితే అందరిలాగ సాధారణమైన జీవితాన్ని గడపవచ్చును. దీనికి సంబదించిన మందుల ఏ ఆర్ టి లో అందుబాటులో ఉండును. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రము మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎగదండి బాబు పిహెచ్ఎన్ రజిని సూపర్ వైజర్లు లూర్థ్ మేరీ, శోభా రాణి, పద్మ , ల్యాబ్ టెక్నీషియన్ లు మరియు ఏఎన్ఏం లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు




