సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమం మంగళ వారం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతీన్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రతి రోజు ఉదయం రోగులకు వారి బంధువులకు అల్పరం పంపిణీ చేయడం జరిగింది అని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ రామ్ ఫనిధర్ రావు, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, ఎన్విరాన్మెంట్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర చారి,సంజయ్, నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, గుడాల రాధాకృష్ణ, ఎల్లం రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు




