పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించడం ప్రభుత్వం లక్ష్యం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.
ఈరోజు అహ్మదిపూర్ గ్రామానికి చెందిన శనిగారి మరియమ్మకు ముప్పై వేల రూపాయలు మరియు పాల స్వామి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను బాధితులకి అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.సీఎం సహాయ నిధి పేద ప్రజలకు ఒక ఆర్థిక భరోసా అన్ని అన్నారు.ఆపదలో సీఎం సహాయ నిది ఒక వరంలాంటిదని అని అన్నారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ గారు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక ఈఫండ్ ఆసరాగా నిలిచిన విషయాన్ని వారు వెలిబుచ్చారు.బాధితులు అవసరమైన సమయంలలో ఈ పథకాన్నీ సద్వినిమెాగపర్చుకొవాలి అని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికి ఆదర్శం అని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు.ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలాలూ ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని వారు పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్,రైతు భీమా.రైతు బంధు పథకాలు,మిషన్ భగీరథ,కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అయిందని అయన తెలిపారు.టిఆర్ఎస్ ప్రభుత్వంతో గ్రామాల రూపు రేఖలు పూర్తిగా మరాయి అని పల్లె ప్రగతితో గ్రామాలు అధ్బుతమైన శోభ సంతరించుకున్నాయి అన్నారు. గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. ప్రజల్లో ఒక నమ్మకాన్ని ,భరిసాను ఈ ప్రభుత్వం నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ చాడ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, తెరాస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో అప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, తెరాస నాయకులు కొత్తపల్లి రామగౌడ్, వార్డు సభ్యులు ఎర్ర ఎల్లయ్య సాకలి శ్రీను, లబ్ధిదారులు పాల్గొన్నారు.
