*బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. రైతులు వరి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి వారం రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఆలస్యం అవుతున్నాయని, వాతావరణ మార్పుల వలన వర్షాలు పడుతున్నాయని, రైతుల బాధలు అర్థం చేసుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్య తీసుకోలేని వేల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని బిజెపి గంభీరావుపేట మండలం ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్ డిమాండ్ చేశాడు