విజయవాడ వరదలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు..బాధితులకు చేయూత అందించేందుకు పలు సంస్దలు,పార్టీల నేతలు తదితరులు ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలో భాగంగా గూడూరుకు చెందిన శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత..విజయవాడ నగరంలో వరదలు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు దస్తులు పంపిణీ చేశారు.
గూడూరు పట్టణానికి చెందిన శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత..విజయవాడలోని వరదలు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించారు..గూడూరు,తదితర ప్రాంతాల్లో సేకరించిన వివిధ రకాల దుస్తులతో పాటు శ్రీ ఫ్యాషన్స్ తరపున కొనుగోలు చేసిన నూతన దుస్తులు కలిపి విజయవాడ వరద ప్రాంతాల్లోని నిరాశ్రయులకు అందజేశారు.అక్కడి వారితో ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా శ్రీ ఫ్యాషన్స్ అధినేత మమత మాట్లాడుతూ..వరద బాధితులకు చేతనైన సాయం చేసేందుకు విజయవాడకు రావడం జరిగిందన్నారు.ఇటీవల సంభవించిన విపత్తు కారణంగా విజయవాడలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని,తీరని నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు.ఇక్కడి పరిస్దితులు చూస్తుంటే మనసు చలించవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు వెయ్యి కుటుంబాలకు దుస్తులు అందజేయడమే లక్ష్యంగా తాము చర్యలు తీసుకున్నామని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేటకు చెందిన అపర్ణ,నెల్లూరుకు చెందిన మానస,తదితరులు పాల్గొన్నారు.
