రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం వాహనదారుల మితిమీరిన వేగానికి కళ్లెం వేయడానికి రాజన్న సిరిసిల్ల పోలీస్ లు శ్రీకారం చుట్టారు.అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానా విధిస్తున్నారు. వాహనాల అతివేగం నియంత్రణ ,ప్రజల ప్రాణాల రక్షణనే లక్ష్యంగా స్పీడ్ లేసర్ గన్ ఉపయోగిస్తున్నారు…
ఈ సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ రాజు సిరిసిల్ల బై పాస్ ప్రాంతంలో స్పీడ్ లేసర్ గన్ తో అతి వేగంగా వెళ్లే వాహనాలపై జరిమానాలు విధించారు..
అనంతరం ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ రాజు మాట్లాడుతూ….
ప్రతి వాహనదారుడు ప్రధాన రహదారుల మీద 60 కిలోమీటర్ల వేగం మించకుండా మరియు మున్సిపల్ ,గ్రామాల పరిధిలో మూల మలుపుల వద్ద,పాఠశాలల,కళాశాలల వద్ద 40 కిలోమీటర్ల వేగము మించకుండా ప్రయనిచవలెను అన్నారు..అదేవిధంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించవలెను అన్నారు..స్పీడ్ లేజర్ గన్ యంత్రాన్ని ప్రతి రోజు వేర్వేరు ప్రదేశాలలో వుంచి అతి వేగంగా వెల్లుచున్న వాహనాల ఫోటోలు తీసి జరిమానాలు విధించడం జరుగుతుంది.జరిమానాలు విధించడం మా ఉద్దేశ్యం కాదు మీ ప్రాణాలు రక్షిణాచడమే మా ముఖ్యవిధి.కావున ప్రజలు పరిమిత వేగంతో వెల్లుచు జరిమానాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీస్ వారికి సహకరించాలని కోరుకుంటున్నాం.





