ప్రాంతీయం

గంభీరావుపేట ఉర్దూమీడియం పాఠశాలలోఘనంగా ప్రపంచ ఆహారదినోత్సవం వేడుకలు

111 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో స్థానిక కేజీ టూ పీజీ విద్యాసంస్థల్లో జడ్పీ హెచ్ ఎస్ ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రపంచ ఆహార దినోత్సవం(వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ )దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉర్దూ మీడియం ప్రధాన ఉపాధ్యాయులు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆహార దినోత్సవం ఆదివారం రావడంతో  శనివారం ఉర్దూ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని కేజీ టూ పీజీ విద్యాసంస్థల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆహ్వానం పంపడం జరిగిందని ప్రతి పాఠశాలల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారని తెలిపారు. ముఖ్య అతిధిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పిట్ల దాసు, ప్రభుత్వ బాలుర పాఠశాల ఉపాధ్యాయులు గంగారాం, బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలఎల్లయ్య , ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం ప్రధాన ఉపాధ్యాయురాలు రజని మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారని.ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులు ఎంతో కృషితో ఇంట్లో సేమియాలను,పండ్లు,పిండి మరియు పాల పదార్థాలను తయారు చేసారని తెలిపారు.ఈ సందర్భంగా ఉర్దూ మీడియం విద్యార్థులకు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు తరనుమ్,ఫసియుద్దీన్,విధ్యార్ధుల తల్లిదండ్రులు నజ్ మొద్దీన్, ఖాలిద్,  వాజిద్ ఖాన్  మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna