ప్రాంతీయం

కళాశాలలు పెట్టే ఒత్తిడి చదువులక, చావులక.. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్…

118 Views

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 2, సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతు రాష్ట్రం లో విద్యార్ధుల పైన ఒత్తిడి పెట్టే కార్పొరేట్ కళాశాల గుర్తింపు ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి విద్యార్ధులకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. నార్సింగ్ లోని శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాల లో యాజమాన్యం ఒత్తిడికి ఒక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధ కరం అని అన్నారు.కేవలం హాస్టల్ యాజమాన్యం,ప్రిన్సిపాల్, మరో ఇద్దరు ఉపాధ్యాయుల వల్ల నేను ఈ తప్పు చేస్తున్నాను అని లెటర్ రాసి చనిపోయాడు అంటే ఎంత బాధ కారం అని అన్నారు. కళాశాలలో ప్రినిపల్ విద్యార్ధులకి కొడుతున్న వీడియో మరియు మిగిలిన విద్యార్ధులను కొట్టడం కులం పేరుతో తిట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. వెంటనే కళాశాల గుర్తింపు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈదకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్టే నరేష్, పట్టణ అధ్యక్షులు రుద్రవేనీ సుజిత్ కుమార్, నాయకులు పొతర్ల వంశీ, పోతార్ల గణేశ్, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *