– గ్రామ ప్రజా ప్రతినిధి అండదండతో తరలుతున్న ఇసుక
– నదుల నుండి ఇసుకను తోడుతున్న ఇసుకాసురుడు
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులుముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్ /15;రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఇసుక లభ్యత లేక ఇదే అదునుగా చూసుకొని అక్కపళ్లి గ్రామ శివారులో ప్రవహిస్తున్నటువంటి వాగునుండి ఇసుకను పల్లెలోని ఓప్రజా ప్రతినిధి కొడుకు అండదండలు చూసుకొని అట్టి వాగునుండి అర్ధరాత్రి నుండి ఇసుకను అక్రమంగా మాయం చేస్తున్నాడు. వర్షాకాలం కావడం వల్ల వరదలు వాగులు ప్రవహిస్తుంటే ఇసుక కొరత ఏర్పడడం వల్ల పల్లెలోని చిన్న వాగులనుండి ఇసుకను తీసి ఎల్లారెడ్డిపేట అక్కపళ్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అధిక రేటుకు విక్రయిస్తూన్నారని ఆరోపణలు
.
సొమ్మును చేసుకుంటున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు.ఇట్టి విషయంపై తాసిల్దార్ జయంత్ కుమార్ ను చరవాణిలో వివరణ కోరగా…. వీఆర్ఏల కొరతవల్ల సరిగా పట్టించుకోలేకపోయామని త్వరితగతిన నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఎవరైతే అక్రమంగా ఇసుక తరలిస్తారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
