భగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు
-11,12 వార్డు సభ్యుల ఆవేదన..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలోని 11 12 వార్డు సభ్యులు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తమ గోడు ను వెళ్లబుచ్చుకున్నారు. నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని భగీరథ ఏ ఈ తమ సమస్యలను గూర్చి తెలిపిన నిమ్మకు నిరత్తినట్టు ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు ముస్లిం వాడలో ఉన్న 11వ వార్డు సభ్యులు మంచినీటి కోసం నాన్న తండాలు పడుతున్నామని చెబుతున్నారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తమ సమస్యలను తీర్చాలని కోరుతున్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఓట్లు అడగడానికి వస్తే తమ ప్రతాపాన్ని చూపిస్తామని చెప్పారు మా సమస్యలను తీర్చే నప్పుడు ఓట్లు అడగడం ఎందుకు దండగ అని జోస్యం పలికారు. కనీసం నీకు నీళ్లు వస్తున్నాయా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అని అడిగే నాతోడే కరువయ్యారని వేల్పూర్ 11 12 వార్డు కాలనీవాసులు ఆవేదన చెందారు. ఇదే విషయంపై గత కొన్ని రోజుల క్రితం కాలానికి చెందిన మహమ్మద్ అప్సర్ ఏఈ తో మాట్లాడగా సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటివరకు మా కాలానికి వచ్చి చూసిన పాపాన పోలేదని మీడియాతో అన్నారు.
