ముస్తాబాద్, సెప్టెంబర్ 10 (24/7న్యూస్ ప్రతినిధి): వెంకట్రావుపల్లి గ్రామంలోని గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసినఇంట్లో చొరబడి 2.తులాల బంగారం 27.తులాల వెండి15వేల నగదును అపహరించారు. గ్రామానికి చెందిన పోచంపల్లి పద్మ వర్షాలకు సొంతఇల్లు కూలడంతో పక్కన ఉన్నఇంట్లో ఉండగా.. ఎవరులేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టీ నగలతో పాటు నగదు చోరీకీ గురైనట్లు
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు బాధితురాలు తెలిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్సై సిహెచ్, గణేష్ తెలిపారు.




