Breaking News

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి….

187 Views

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చిన్నారి మృతి. ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి వెంకటేష్ గౌడ్ కు 18 నెలల వయసు గల నేహన్య చిన్నారి ప్రమాదవశాత్తు టేబుల్ ఫ్యాన్ ముట్టగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది. కోన ఊపిరితో ఉన్న ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికె మృతిచెందినట్లు నిర్థారించారు.పాప తండ్రి బతుకుదెరువు రీత్యా దుబాయ్ దేశములో ఉన్నారు.చిన్నారి మృతి పట్ల సర్పంచ్ రాదరపు పుష్పల శంకర్,ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం ,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ యాదవ్ లు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్