మంచిర్యాల జిల్లా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేల ,నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని వారి నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ మొదలైన క్రమంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ షెడ్యూల్లో రోజువారి క్రమంలో తయారు చేసుకొని, ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసి వారి పార్టీ తరఫున విడుదల చేసిన మేనిఫెస్టోను తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు.
మంచిర్యాల జిల్లా ,మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మున్సిపాలిటీల వారిగా, గ్రామాల వారీగా ,వార్డుల వారీగా, ప్రజలను కలుస్తూ తమకే ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే అభ్యర్థులు కోరుచున్నారు.
ప్రజలు కూడా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఓటు వేసే ముందు ఏ పార్టీకి ఓటు వేస్తే నియోజకవర్గం అభివృద్ధిలోకి వస్తుందో , ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి బాగా చేస్తారో, ప్రజల సమస్యలను తీరుస్తారో, అలాంటి వ్యక్తికి ,పార్టీకి ఓటు వేయాలో ఆలోచించి, సరైన వ్యక్తిని ఎంచుకొని ఓటు వేయాల్సిన బాధ్యత ఓటర్ల పైన ఎంతైనా ఉంది.
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు వారి ఏ పార్టీకి ఓటు వేసి అధికారాన్ని చేకూరుస్తారో వేచి చూడాల్సిన ఉన్నది.






