దౌల్తాబాద్: ఆశా వర్కర్లకు వేతనం రూ, 18 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్ బాలమణి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మెడికల్ ఆఫీసర్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని కాని ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ,18 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.32 రకాల రిజిస్టర్లను ప్రభుత్వమే సప్లై చేయాలని అన్నారు. టీబీ,లెప్రసి,కంటి వెలుగు సంబంధించిన తదితర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించి వాలంటీర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆశాలకు సంబంధంలేని అధనపు పనులను రద్దు చేయాలని 2021 సంవత్సరంలో ఆరు నెలలు పెండింగ్లో ఉన్న పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు. ఆశ వర్కర్లకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ లు లక్ష్మి, భాగ్య, కౌసల్య, సుకన్య, రజిత, లావణ్య, షాహేదా, రేణుక, కనక లక్ష్మి, షాహిన్ సుల్తానా, లక్ష్మీ, మంజుల, సౌజన్య, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు….
