వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి…
బిజెపి గొల్లపల్లి గ్రామ శాఖ తరుపున వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు
రాచర్ల గొల్లపల్లి లోని బీజేపీ నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచాలని మరియు వరి ధాన్యం దళారుల పాలు కాకుండా కోతలు లేకుండా చూడాలని వారు కోరారు వరి కోతలు చేపట్టి పదిహేను రోజులు అవుతున్న ఇంకా కొనుగోలు కేంద్రాలను చేపట్టలేదని ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు విక్రయించు చున్నరని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రైతులు నష్ట పోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బీజేపీ గ్రామ శాఖ తరుపున వారు సొసైటీ వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణ మూర్తి గారికి వినతి పత్రం అందించారు
