మోసపూరిత లింకులు ఓపెన్ చేయవద్దు
సెప్టెంబర్ 20
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం ఎస్సై కోనారెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ మోసాలు అనేకంగా జరుగుతున్నాయని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం తెలుపవద్దని, ఉచితాలకు ఆశపడి మోసపూరిత లింకులను ఓపెన్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు.
