వర్షం సైతం లెక్కచేయకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా ముదిరాజుల ఆధ్వర్యంలో ముదిరాజుల మహాధర్నా కార్యక్రమం వర్షంలో సైతం గొడుగులతో చేపట్టారు..
ముదిరాజులకు చట్ట సభల్లో 30 ఎమ్మెల్యే సీట్లు,3 ఎమ్మెల్సీ సీట్లు, 2 మంత్రి పదవులు,2ఎంపీ పదవులు,4 జెడ్పి చైర్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులతో పాటు, మత్స్యకారులకు 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ విధానంతో పాటు, ప్రమాద బీమా ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచాలని పలు రకాల డిమాండ్లతో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.