మంచిర్యాల జిల్లా
భారతీయ జనతా పార్టీ బి. సి నీ ముఖ్యమంత్రి గా ప్రకటించడంపై హర్షము వ్యక్తం చేస్తూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.
నిన్న సూర్యాపేట లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోమ్ శాఖ మాత్యులు అమిత్ షా తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తే బీసీ నీ ముఖ్యమంత్రి గా ప్రకటించిండం పై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో సీసీసీ లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం అని అన్నారు.
