.పోలీసుల విధులను ఆటంక పరిచిన ఐదుగురి రిమాండ్.
వినాయక నిమర్జనంలో భాగంగా వెంకటాపూర్ గ్రామంలో శనివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుక్కల వెంకటేష్, పడిగే ఆదర్శ్, కంకణాల సురేష్, పొన్నం సాయి, కంకణాల సాయి, మరికొందరు పోలీసుల విధులకు ఆటంకం కలగజేశారని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటినుండి వారు పరారీలో ఉండగా ఆ ఐదుగురిని పట్టుకొని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు శుక్రవారం రిమాండ్ చేశారు.
24 గంటలు ప్రజల కోసం పనిచేసే పోలీసుల విధులకు ఆటంకం కలగజేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
