అక్టోబర్ 6 రామగుండం పోలీస్ కమిషనరేట్:
నిందితుని వివరాలు:
షేక్ షాహిద్ సన్నాఫ్ రషీద్ వయసు 23 సంవత్సరాలు రాజీవ్ నగర్, మంచిర్యాల.
ఈ రోజు సాయంత్రం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిసిసీ నస్పూర్ సర్వీస్ రోడ్డు వద్ద రాజీవ్ నగర్ నుండి గోదావరిఖని వైపు వస్తున్న ఆటోను ఆపి నమ్మదగిన సమాచారం మేరకు ఆటోలో అనుమానస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న బ్యాగ్ లో 1 కేజీ డ్రై గంజాయిల భించింది. దీని విలువ సుమారు 25000/- రూపాయలు ఉంటుంది. అనంతరం అతడిని విచారించగ అతని పేరు షేక్ షాహిద్ అని తెలిపి చెడు అలవాట్లకు, గంజాయి కి బానిసై గంజాయి తను తాగడం కోసం మరియు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదగించాలనే దురుదేశ్యంతో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి గోదావరిఖని ప్రాంతంలోని అమాయకపు స్టూడెంట్స్, యువత కి ఎక్కువ ధరకు అమ్ముతానని తెలపడం జరిగింది.
నిందితున్ని అతని వద్ద లభించిన గంజాయి స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ కోసం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
