సింగరేణి కార్మికులకు ఈ సంవత్సరం లాభాల వాటాను వెంటనే ప్రకటించాలి – ఏఐఎఫ్టియు.
ఆగస్టు 9 సింగరేణిలో ఈ సంవత్సరం సాధించిన లాభాల నుండి కార్మికుల వాటాగా 35% బోనస్ చెల్లించాలని శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఇప్పటివరకు లాభాలు చెప్పకుండా సింగరేణి అధికారులు తాత్చారం చేస్తున్నారని వెంటనే ఈ సంవత్సరం లాభాలు ప్రకటించి కార్మికులకు 35 శాతం లాభాలను బోనస్ రూపంలో చెల్లించాలని ఆ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకులు రామన్న , పోచమల్లు , రత్నకుమార్ రామస్వామి, యాకయ్య ఆర్ రాజ్ కుమార్లు డిమాండ్ చేశారు.
సింగరేణిలో కార్మికులు అనేక రకాల కష్టనష్టాలకోర్చి సంస్థకు వేలకోట్ల రూపాయలు లాభాలు తెస్తుంటే అధికారులు మాత్రం కార్మికులను చిన్నచూపు చూస్తూ పనిభారాన్ని పెంచుతూ అనేక రకాల వేధింపులకు పాల్పడుతున్నారని సరైన పనిముట్లు అందించకుండా కార్మికుల మీద జులుం చేస్తూ వేధింపులకు దిగుతున్నారని సింగరేణి అధికారులు నిరంకుశ విధానాలను మానుకొని నాణ్యమైన పనిముట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు.
