రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఇరిగి పర్షరాములు ఆధ్వర్యంలో మహానీయుడు పెరియార్ రామస్వామి నాయకర్ 143 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజక వర్గం మహిళా కన్వీనర్ మనపల్లి సుధ , నియోజక వర్గ ప్రదాన కార్యదర్శి యారపు రాజబాబు, పాల్గొనడం జరిగిందివారు మాట్లాడుతూ మనవాద బ్రాహ్మణిజం హిందూ కుల వ్యవస్థ పేరుతో జరిగే అన్యాయాలు, మూఢనమ్మకాలను, దేవుడి పేరుతో జరిగే మోసాలను, కూకటి వేళ్ళతో సహా పెకిలించి, సమస్త ప్రజానీకంన్ని జ్ఞానం వైపు మళ్లించిన యోధుడు, మనువాద బ్రాహ్మణ కుట్రల నుంచి క్షుద్ర కులాలను విడుదల చేసి జ్ఞానంవైపు నడిపించిన వీరుడు, చరిత్రలోఆనాడే మనువాద గుండెల్లో దడలు పుట్టించి,యావత్ ప్రపంచానికి మనువాదుల కుట్రలు కుతంత్రాలను తెలియచేసిన ధీరుడు .ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి యారపు రాజబాబు, సిరిసిల్ల జిల్లా కో కన్వినర్ మనపల్లి సుధా, మహిళా నాయకురాలు యారపు సంధ్య, సెక్టార్ కమిటీ అధ్యక్షులు పెండేల బాలయ్య, బూత్ కమిటీ అధ్యక్షులు చింతకింది స్వామి, టౌన్ ప్రెసిడెంట్ ఎర్రోళ్ల బాలకిషన్, బీఎస్పీ నాయకులు మేడిపెల్లి శ్యామ్, ఎగదండీ మధు, పిట్ల రామ్ల,లక్ష్మణ్, బీఎస్పీ సీనియర్ నాయకులు దోసల ఉపేంద్ర, కర్రోల్ల రాజు,మల్లేశం, భీమరావు తదితరులు పాల్గొన్నారు
