గూడులేని అవ్వకు తోడై నిలిచాడు బీజేపీ నేత నందన్ గౌడ్,వారంలోగా ఇంటిని నిర్మించి గృహ ప్రవేశం అయ్యేలా కృషి చేస్తానని ఆ వృద్ధ మహిళకు హామీ ఇచ్చి మానవతా దృక్పథాన్ని చాటాడు ఆ నేత.
సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇల్లులేని నిరుపేద మహిళకు బాసటగా నిలిచాడు బీజేపీ రాష్ట్ర నాయకుడు నందన్ గౌడ్. 9వ వార్డులో నివాసముండే మాదారం బుచ్చమ్మ వర్షం వస్తే గొడుగు కింద ఉండి కాలం వెళ్లబోస్తుందని విషయం తెలుసుకున్న ఆయన ఆ వృద్ధురాలు ఉంటున్న గుడిసె, పరిసరాలను పరిశీలించి చలించాడు.తక్షణమే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి వారంలోగా గృహప్రవేశం చేసుకునేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు నందన్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయానా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే గజ్వెల్ నియోజకవర్గ కేంద్రంలో ఇలాంటి దుస్థితినెలకొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్రం అంతటా పేదలకు డబుల్ బెడ్రూంలు కట్టిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ కి గజ్వెల్ వృద్ధురాలు దుస్థితిని గూర్చి తెలియకపోవడం దురదృష్టకరమని నందన్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశాడు.ఇక సొంత ఇంటి కళ నెరవేరనుండటంతో ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.
