సావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం…
– ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు-
రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. ఉమ్మడి మండలంలోని వీర్నపల్లి ముదిరాజ్ భవనము ఏర్పాటు జరిగే వరకూ కార్యవర్గాన్ని ఏర్పరచుకుంటున్నట్లుగా పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షతన రణవేణి లక్ష్మణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టల బాబు ఆధ్వర్యంలో నూతనంగా మండల అధ్యక్షులుగా తిమ్మాపూర్ కు చెందిన దండు శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా బోయిన నరసయ్య ప్రధాన కార్యదర్శిగా పేరు మండల సతీష్ కోశాధికారికి తెజరీ బాల నర్సు గౌరవ అధ్యక్షులుగా పెద్దమ్మల దేవయ్య బొమ్మన వేణి నారాయణ వ్రాతకులుగా దాసరి సత్తయ్య, జిన్నా నాంపల్లి కన్నవేణి సాయిలు, సత్తయ్య, కోల బాబు, మత్స్య శాఖ గ్రామ అధ్యక్షులు పర్శ సత్తయ్య, గడ్డమీది రాజయ్య ఇరువురి గ్రామ కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ఉండగా తిమ్మాపూర్ గుండారం సభ్యులుగా పరిగణించలేమని మా సంఘంలో సభ్యత్వం కాదని ప్రస్తుతం అధ్యక్షులుగా పని చేసిన దేశ్పాండే ఆంజనేయులు విలేకరులతో ఖండించి మాట్లాడడం పట్ల చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయాన్ని తిమ్మాపూర్ సభ్యులకు వివరణ కోరగా సభ్యత్వానికి 40,000 రూపాయలు సంఘానికి చెల్లించడం జరిగిందని అన్నారు ఈనెల 15వ తారీఖున సమావేశం ఉందని ఆంజనేయులుకు కుల సంఘానికి ఆహ్వానం పలికిన రాలేదని అన్నారు ఉమ్మడి మండల మరియు ఎల్లారెడ్డిపేట శాఖల మధ్య సమన్వయం లోపిస్తుందని పలువురు పేర్కొంటున్నా ముందుకు నడిపిస్తామని నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు పేర్కొన్నారు
